RailOne : ఇకపై ట్రైన్ టికెట్ కోసం కొత్త యాప్! వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ప్రయాణికుల అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చే దిశగా భారతీయ రైల్వే మరో ముందడుగు వేసింది.
టెక్నాలజీని వినియోగిస్తూ ప్రయాణీకుల అవసరాలన్నింటినీ ఒక్కచోట కలిపేలా ‘RailOne’ సూపర్ యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది.
ఈ యాప్ ద్వారా రిజర్వేషన్, టికెట్ బుకింగ్, ట్రైన్ స్టేటస్, ఫీడ్‌బ్యాక్, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, మరియు e-Wallet సేవలు లభిస్తాయి.
ఇది ఒకే ప్లాట్‌ఫాంపై భారతీయ రైల్వేకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సేవలను సమకూర్చే సూపర్ యాప్‌గా పేరుగాంచుతోంది.
ఇప్పుడు ఈ అన్నింటినీ కలిపి ‘RailOne’ అనే యాప్‌లో సమగ్రంగా పొందే అవకాశం ఏర్పడింది. ఇది ఒకే ఇంటర్‌ఫేస్‌లో అన్ని సేవలను పొందేలా రూపొందించబడిన మొదటి రైల్వే సూపర్ యాప్.
IRCTC Rail Connect – రిజర్వ్డ్ టికెట్ల కోసం, UTSonMobile – అన్‌రిజర్వ్డ్ టికెట్ల కోసం, Food on Track – భోజన ఆర్డర్ కోసం, NTES – ట్రైన్ సమాచారం కోసం.