Credit Card: క్రెడిట్ కార్డ్ వాడకుండా ఎంత కాలం ఉంచుకోవచ్చు ! సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిపోతుంది. కూరగాయలు, ఫుడ్, ట్రావెల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఎన్నో అవసరాల కోసం క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఆఫర్లు, డిస్కౌంట్ల కోసం చాలా మంది క్రెడిట్ కార్డులను వివిధ బ్యాంకుల నుండి తీసుకుంటున్నారు.
అయితే తీసుకున్న క్రెడి కార్డును చాలా కాలంపాటు ఉపయోగించకుండా ఉంటారు. ఇలా క్రెడిట్ కార్డ్స్ వాడకుండా ఉండటం వలన ఏం జరుగుతుంది!
ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వరకు క్రెడిట్ కార్డ్ ఉపయోగించకుండా ఉన్నట్లయితే, బ్యాంకు వారు మీ క్రెడిట్ కార్డును క్లోజ్ చేయవచ్చు.
క్రెడిట్ కార్డ్ యాక్టివ్‌గా ఉండాలంటే సంవత్సరంలో కనీసం ఒక్క రోజైనా ఏదైనా ట్రాన్సాక్షన్ చేయండి.
క్రెడిట్ కార్డ్ వాడకుండా ఉండటం వలన, అది యాక్టివ్‌గా ఉన్నంత వరకు క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. క్రెడిట్ కార్డు వాడకపోవడం వలన క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ( CUR )పై ప్రభావం ఉంటుంది.