Black Salt | మీరు రోజూ వాడే ఉప్పుకు బదులుగా ఈ బ్లాక్ సాల్ట్‌ను వాడి చూడండి.. ఎన్నో లాభాలు కలుగుతాయి..!
బ్లాక్ సాల్ట్.. దీన్నే హిందీలో కాలా నమక్ అంటారు. దక్షిణ ఆసియాకు చెందిన చాలా మంది బ్లాక్ సాల్ట్‌ను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
చాట్స్, సలాడ్స్, ఇతర శాకాహార వంటకాల్లో బ్లాక్ సాల్ట్‌ను ఎక్కువగా వాడుతారు.
అయితే ఆయుర్వేద ప్రకారం బ్లాక్ సాల్ట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది పలు రకాల వ్యాధులకు మెడిసిన్‌లా పనిచేస్తుంది.
మీరు రోజూ వాడే సాధారణ తెల్ల ఉప్పుకు బదులుగా బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
బ్లాక్ సాల్ట్‌ను వాడడం వల్ల జీర్ణాశయంలో జఠరాగ్ని పెరుగుతుంది. ఇది ఆల్కలైన్ గుణాలను కలిగి ఉంటుంది.
బ్లాక్ సాల్ట్‌లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. కనుక పొట్టలో ఏర్పడే అసిడిటీని తగ్గిస్తాయి. లివర్‌లో పైత్య రసం సరిగ్గా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తాయి.