Constable Jobs 2025: 7565 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..వెంటనే దరఖాస్తు చేసుకోండి.!
నిరుద్యోగులకు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ సర్వీస్‌లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 7,565 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు 4,408 పోస్టులు, మహిళలకు 2,496 పోస్టులు కేటాయించారు. అలాగే, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు మిగిలిన పోస్టులు ఉన్నాయి.
ఈ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 21 చివరి తేదీ. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు, 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంది.
Salary and allowances, selection process
ఈ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది. ఇది ఉద్యోగంలో చేరిన తర్వాత లభించే బేసిక్ పే స్కేల్. ఆ తర్వాత అలవెన్సులు అదనం. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) నిర్వహిస్తారు. ఈ అన్ని దశల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
Constable Jobs 2025
ఈ ఢిల్లీ పోలీస్ Constable Jobs 2025 కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే చివరి రోజుల్లో వెబ్‌సైట్ సర్వర్ బిజీగా ఉండే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం ssc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. ఈ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులు పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు.

